ఉపాధ్యాయుల రక్తదానం అభినందనీయం
టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రక్తదానం ప్రాణదానంతో సమానము అని టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నందు మెగా రక్తదాన శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.
రక్తదానం వలన ఆపదలో రక్తం అవసరమైన వారికి సహాయ పడటమే కాక, రక్తదానం చేయడం పట్ల ఉన్న అపోహలను తొలగించినవారవుతారని అన్నారు. సామాజిక సేవ చేయడంలో టిఎస్‌యుటిఎఫ్ సంఘాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమాజాన్ని భాగస్వామ్యం చేసుకుని ఉద్యమిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రక్తదానశిబిరాన్ని నల్లగొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి సందర్శించి మాట్లాడుతూ, టిఎస్‌యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యం.రాజశేఖర్ రెడ్డి, టిజిఈజెఏసి నల్లగొండ జిల్లా ఛైర్మన్ నాగిళ్ల మురళి, టిఎస్‌యుటిఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు బక్కా శ్రీనివాస చారి,పెరుమాళ్ల వెంకటేశం,టిఎన్జీఓ జిల్లా జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు భిక్షం ,వార్డెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రణదేవె, టిఎస్‌యుటిఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న,రాచమల్ల రమాదేవి, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యం. మురళయ్య,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎరనాగుల సైదులు, స్టడీ సర్కిల్ కన్వీనర్ రాగి రాకేష్ మరియు టిఎస్‌యుటిఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES