నవతెలంగాణ-మల్హర్ రావు: ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు అశగా ఎదురుచూస్తున్నారు. అర్హులు, నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అర్హులకు నూతనంగా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులకు నిరీక్షణ తప్పడం లేదు. మండలంలో మొత్తం ఆసరా పింఛన్లు మొత్తం 3349, ఇందులో వృద్ధాప్య 1194, వితంతు 1525, వికలాంగులు 530, గీతకార్మికులు 66, చేనేత కార్మికులు 8, ఒంటరి మహిళలు 26 ఉంన్నాయి.కొత్తగా పీoచన్ల కోసం దాదాపుగా 1500 అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు మాత్రం కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు.
జాడలేని కొత్త పింఛన్లు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES