ఎస్సీ వర్గీకరణ పక్కన పెట్టి.. రాజ్యాధికారం వైపు పయనిద్దాం

– మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గతంలో ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఎస్సి వర్గీకరణ పై హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి నారాయణస్వామి రాజ్యసభ వేదికగా ఎస్సీ వర్గీకరణ కాదని స్పష్టం చేశారని ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ అంశం పక్కన పెట్టి మన సోదరులు అందరూ కలిసి రాజ్యాధికారం వైపు పయనిద్దామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో ఎస్ఆర్ఎల్ ఫంక్షన్ హాల్ లో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యా రు. హుస్నాబాద్ కట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి, ప్రజా యుద్ధనౌక గద్దర్  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు ఇటీవల కాలం లో రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా తమ రాజకీయా స్వలాభం కోసం పదేపదే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదికి తె స్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాజ్యసభ వేదికగా ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బిజెపి కేంద్రమంత్రి నారాయణస్వామి బదులిస్తూ ఎస్సి వర్గీకరణకు ఏడు రాష్ట్రాలు మాత్రమే మద్దతు ఇచ్చాయని 14 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయని ఎస్సీ వర్గీకరణ కాదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కు ఏ పార్టీ అయినా మద్దతు ఇచ్చిన ఆ పార్టీని వచ్చే ఎన్నికలలో మాలలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరేపు ఎల్లేష్, మాల మహానాడు మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అల్లిబిల్లి నరసింహారావు, జిల్లా అధికార ప్రతినిధి రాముల వెంకట్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు ప్రబ్బతి  సతీష్, హుస్నాబాద్ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మేకల బాబురావు, న్యాయవాది రాజమౌళి, కోహెడ మండల అధ్యక్షుడు సుమన్, లక్ష్మీరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love