Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ లో రోడ్డు విస్తరణ పనులను, రోడ్డు డ్రైనేజీ పనులను శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు. రూ.2 కోట్ల 30 లక్షల రూపాయలతో SC హాస్టల్ నుంచి బ్యాంకు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, దానికి అదనంగా మరో 11 కోట్ల రూపాయలతో డ్రైనేజీ రోడ్డు విస్తరణ పనులు చేయడం జరుగుతుందన్నారు.

అమ్రాబాద్ మండల కేంద్రంలో రోడ్, డ్రైనిజ్ సరిగ్గా లేక గత 20 సం||ల నుంచి గ్రామ ప్రజలు అవస్థులు పడుతున్నారాని, గత ప్రభుత్వం 10సం||ల పరిపాలన చేసిన అమ్రాబాద్ గ్రామంలో కనీసం ఒక రోడ్డు కూడా వెయ్యని నీచ ప్రభుత్వం బీఆర్ఎస్ ది అని అన్నారు. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మండల హెడ్ క్వార్టర్ కి రోడ్డు వేయించడం జరుగుతుందని. అందులో భాగంగా దానికి అదనంగా 11 కోట్ల రూపాయలు సాంక్షన్ రావడం జరిగిందన్నారు.

రాబోయే రోజుల్లో అమ్రాబాద్ మండల రూపురేఖలు మార్చేందుకు నా సహాయ శక్తుల ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి విషయంలో ఎంత మంది కుట్రలు పొందిన, ఎవ్వరు అడ్డు వచ్చిన, ఆది ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు, అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా సహకరించాలని కోరుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad