Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం జీపీ కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలి: సీఐటీయూ

ప్రభుత్వం జీపీ కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ప్రతి కార్మికుని కి ప్రభుత్వం 10లక్షల భీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి తుర్కపల్లి సురేందర్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని  వ్యవసాయమార్కెట్ యార్డ్ లో గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ నిర్వహించిన మండలకమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..ప్రభుత్వాలు మారుతున్న  పంచాయతీ కార్మికులబ్రతుకులో మార్పు రావటం లేదని, ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే చాలిచాలనివేతనం రెగ్యులర్ ఇవ్వకుండా నెలలు తరబడి పెండింగ్ లో పెట్టడం ఏమిటని అన్నారు. కార్మికులు పనులు చేసే ప్రదేశంలో ప్రమాదాలకు గురైతే అనారోగ్యాల బారిన పడి మృతి చెందుతున్నారని, ప్రభుత్వం వారికి 10 లక్షల భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పైళ్ల గణపతి రెడ్డి,బందెల బిక్షం, గడ్డం ఈశ్వర్, కొండే నర్సింహా, ఎడవెల్లి ఎల్లమ్మయ్య, ఉక్కుర్తి. రాములు, బోడ వెంకటేశం, చేరకు జంగయ్య, స్వామి, మూర్తి, పావురాల శ్రీను, సాయిలు, యాదగిరి, తాళ్ల సత్తయ్య, శంకర్, అంజమ్మ, సాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad