రెండుతరాల కవిసంగమం సీరీస్ -43
ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజిలో జరుగుతుంది. హనీఫ్, ఎదిరెపల్లి కాశన్న, మాలతి పల్లా, సలీం, జుర్కి లావణ్య (నిజాంకాలేజి ఎం.ఏ విద్యార్థి) పాల్గొంటారు. – కవిసంగమం
ఏనుగు నరసింహారెడ్డికి తాటికొండాల పురస్కారం
తాటికొండాల భ్రమరాంబ పురస్కారం 2025 సంవత్సరానికి ఏనుగు నరసింహారెడ్డి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 13న ఖమ్మంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. స్వర్ణకిలారి, ప్రసేన్, సీతారాం, ఆనందాచారి, జూలూరు గౌరీశంకర్, గుడిపాటి, మువ్వా శ్రీనివాసరావు, రవి మారుత్, ఇబ్రహీం నిర్గుణ్, మువ్వా జయశ్రీ, తోట సుభాషిణి తదితరులు పాల్గొటారు.
సింగిల్ పేజీ కథలపోటీ
వంశీ ఆర్ట్ థియేటర్స్ 54వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీకిరణం మాసపత్రిక సౌజన్యంతో రామరాజు వేంకట సుబ్బారావు- లక్ష్మీనరసమ్మ స్మారక అంతర్జాతీయస్థాయి సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహిస్తున్నది. సామాజిక అంశాలను స్పశించే కథలను డి.టి.పి.లో ఒక పేజీకి మించకుండా సెప్టెంబర్ 30 లోపు ఎడిటర్ సాహితీకిరణం, 11-13-154, అలకాపురి, రోడ్ నెం.3,హైదరాబాద్ -500102 చిరునామాకు పోస్ట్/ కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
పొత్తూరి సుబ్బారావు, 9490751681