అధికార పార్టీకి భారీ ఓటమి
జాతీయ ఎన్నికలపై ప్రభావం
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా ప్రాంతీయ ఎన్నికల్లో వామపక్ష పెరోనిస్టు పార్టీ గెలుపొందింది. దేశ రాజ ధాని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ భారీ తేడాతో ఓడిపో యింది . ఈ ఫలితాలు వచ్చే నెల జరగనున్న శాసనసభ ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఆ పార్టీ శ్రేణులు కలవరప డుతున్నాయి.. ప్రస్తుత అధ్యక్షుడు జేవియర్ మిలేయి పార్టీకి (లా లిబర్టాడ్ అవాన్జా ) బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ ఎన్నికల్లో 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ నేతృత్వంలోని వామపక్ష పెరోనిస్ట్ ప్రతిపక్ష పార్టీకి 47శాతం ఓట్లు వచ్చాయి. దీంతో మిలేయికి భారీ ఓటమి తప్పలేదు, ఆయన ఓటమిని అంగీకరించారు.