నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలాలకు సంబంధించిన 2025 జుక్కల్ మండల ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికైన 2024 టిఆర్టి ఉపాధ్యాయుడు షేక్ అఫ్రోజ్ ను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా లొంగన్ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామస్తులు , గ్రామ పెద్దలు మాట్లాడారు. గ్రామంలోని పాఠశాలలో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుడు షేక్ ఆఫ్రోజ్ యొక్క నిరంతర కృషి, సృజనాత్మకత,అంకితభావం ను గుర్తించి తను ఏకోపాధ్యాయుడు అయినప్పటికీ ఎంపీపీ ఎస్ లొంగన్ పాఠశాల విద్యార్థులను మరియు పాఠశాలను తీర్చిదిద్దిన తీరును గుర్తించిన జుక్కల్ విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేయడం మా గ్రామస్తులకు గర్వకారణంగా ఉందని గ్రామ పెద్దలు తెలిపారు.
అదేవిధంగా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు షేక్ అప్రోజ్ ను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంఈఓ తిరుపతయ్య, ఖండేబల్లూర్ ప్రధానోపాధ్యాయుడు లాలయ్య, మహ్మదాబాద్ ఎంపీ యుపిఎస్ పాఠశాల హెచ్ఎం కాంబ్లే గోపాల్ , జుక్కల్ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత రెడ్డి, పి ఆర్ టి యు నాయకుడు సుంకరి శ్రీనివాస్. ఖాసిం, పెద్దగుల్లా హెచ్ఎం చంద్రకళ, సిబ్బంది మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు పట్టం కట్టిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES