Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్సాధన కమిటీ పోరాట ఫలితమే సీసీఐ కదలిక

సాధన కమిటీ పోరాట ఫలితమే సీసీఐ కదలిక

- Advertisement -

సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్
వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి
ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలి
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని గత మూడు సంవత్సరాల కాలంగా సీసీఐ సాధన కమిటీ  నిర్విరామంగా పోరాటం చేస్తున్న ఫలితమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిందని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏప్రిల్ మాసంలో  ఢిల్లీకి వెల్లి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రీ కుమార స్వామిని కలిశామన్నారు. సోమవారం హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీఐ సీఎండి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని సీసీఐ పునర్ ప్రారంభం పట్ల సానుకూలంగా స్పందించడాన్ని  సీసీఐ సాధన కమిటీ  స్వాగతిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలని కోరడంను  స్వాగతిస్తున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేసే ఆలోచనలో ఉందని ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ తెరిపిస్తామని పేపర్ ప్రకటనలకే కాకుండా చేతల్లో చూపించి చర్యలు తీసుకొని వెంటనే ప్రారంభించేలా చొరవ చూపాలన్నారు. సీసీఐ పరిశ్రమ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రవాణా వ్యవస్థ, విద్య, వైద్యం వ్యాపార రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సీసీఐ కోసం జరిగే పోరాటం జిల్లా ప్రజల ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటమన్నారు.

ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలవనున్నట్టు తెలియజేశారు. సమావేశంలో సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కొండా రమేష్, బండి దత్తాత్రి, అరుణ్ కుమార్,.వెంకట్ నారాయణ, జగన్ సింగ్, అన్నమొల్ల కిరణ్, నాయకులు ఎన్.స్వామి పాల్గొన్నారు.           

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad