నవతెలంగాణ – చారకొండ
మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో హాస్టల్ సంక్షేమ అధికారి బాలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో విద్యార్థుల శారీరక మానసిక భద్రతకు సంబంధించిన విషయాలను తల్లిదండ్రులకు వివరించారు.
సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత , హాస్టల్ పరిశుభ్రత గురించి వివరించారు. అలాగే విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వసతులు, మెరుగైన విద్య ,క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు గురించి వివరించారు. అలాగే ప్రతినెల విద్యార్థులకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిపారు.పిల్లలకు విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని, విద్యలో పిల్లలు మానసికంగా ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించడం లో తల్లిదండ్రుల పాత్ర కీలకమని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు