- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని గోర్లు మేకలకు మంగళవారం పి.పి.ఆర్ (పరుడు వ్యాధి) నివారణ టీకాలు పంపిణీ చేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ రాజు తెలిపారు. గ్రామంలోని 450 గొర్రెలు 140 మేకలకు ఉచితంగా పి.పి.ఆర్ వ్యాధి నివారణ టీకాల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆరు నెలలకు ఒకసారి పాడి పశువుల పెంపకం దారులకు ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తుందని గోర్లు మేకలు పెంపకం దారులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రోగ నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు ప్రభాకర్ సందీప్ మల్లేష్ ముత్తెన్న పాల్గొన్నారు.
- Advertisement -