నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ వారపు సంత వేలం నిర్వహణ బుధవారం నిర్వహించారు. స్థానిక కార్యాలయంలో కమీషనర్ సుజాత వేలాన్ని ప్రారంభించారు. ఈ సంతను వేలంలో కాండ్రకోట ఉదయ్ కుమార్ రూ.1 లక్షా 50 వేలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.82,500 లకు వేలం వెళ్ళగా.. ఆ ఏడాది అదనంగా రూ.73 500 కు వెళ్ళింది. దీంతో పాటు సంత మార్కెట్లో ని మార్కెట్ గదులు రూ.45,100 కు కట్టా రాంబాబు దక్కించుకున్నారు. మున్సిపాలిటీ కావటంతో ఈ ఏడాది పేరాయిగూడెం సమీపంలో గల కొబ్బరి తోటను కూడా అదనంగా వేలం నిర్వహించటం తో రూ.73 వేలకు దామెరశెట్టి ఫణీంద్ర కుమార్ దక్కించుకున్నారు. మొత్తంగా వేలం ద్వారా మున్సిపాలిటీకి రూ.2,74,100 లు ఆదాయం సమకూరింది.
అశ్వారావుపేట వారాంతపు సంత వేలం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES