– ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
– ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22నుంచి అధికారికంగా అమల్లోకి
– ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిడ్ కోల్పోవడంతో బీమా కంపెనీలపై నిర్వహణ భారం
– నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బేస్ ప్రీమియం పెంపునకు కంపెనీల కసరత్తు
– 10శాతం వరకు ప్రీమియం పెరిగే అవకాశాలు
– వినియోగదారులకు నికరంగా 10% నుంచి 8% వరకే లబ్ధి
– సెప్టెంబర్ 22లోపు పాలసీ కొనుగోలుపై జీఎస్టీ మినహాయింపుతో పాత ప్రీమియం అందిస్తామన్న స్టార్ హెల్త్
నయతెలంగాణ న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులకు భారీ ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18% వస్తువులు, సేవల పన్నును (జీఎస్టీ) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బీమాను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మినహాయింపు పాలసీదారులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చడంలో కొన్ని ఆచరణాత్మక సవాళ్లు ఎదురుకావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కంపెనీలకు ఐటీసీ నష్టం
ప్రస్తుత నిర్ణయంలో ప్రధానమైన ఆందోళన కలిగించే అంశం బీమా కంపెనీలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సౌకర్యం దూరమవడం. ఇప్పటివరకు, బీమా సంస్థలు తమ నిర్వహణ, మార్కెటింగ్, ఏజెంట్ల కమీషన్లు, కార్యాలయాల అద్దె వంటి వివిధ సేవలపై చెల్లించిన జీఎస్టీని తిరిగి క్లెయిమ్ చేసుకునేవి. తాజా మినహాయింపుతో ఆ అవకాశం కోల్పోతాయి. దీనివల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రీమియంలు పెరిగే సూచన
ఐటీసీ ద్వారా కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, లాభదాయకతను కాపాడుకోవడానికి బీమా కంపెనీలు పాలసీల ప్రాథమిక (బేస్) ప్రీమియంలను పెంచే అవకాశం బలంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, బీమా సంస్థలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రీమియంలను 8% నుండి 10% వరకు పెంచవచ్చు. అంటే, పాలసీదారులకు జీఎస్టీ రూపంలో 18% ఆదా అయినా, అందులో కొంత భాగం పెరిగిన బేస్ ప్రీమియం రూపంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది.
ఉదాహరణకు, ఒక వ్యక్తి పాలసీ ప్రీమియం రూ. 20,000 అనుకుంటే, ఇప్పటివరకు 18% జీఎస్టీతో కలిపి రూ. 23,600 చెల్లించేవారు. జీఎస్టీ రద్దు తర్వాత రూ. 20,000 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఒకవేళ కంపెనీ బేస్ ప్రీమియంను 10% పెంచితే, కొత్త ప్రీమియం రూ. 22,000 అవుతుంది. అప్పుడు వినియోగదారుడికి కలిగే అసలు ప్రయోజనం రూ. 1,600 మాత్రమే.
పాలసీదారులకు తుది ప్రయోజనం ఎంత?
ప్రాథమిక ప్రీమియంలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తం మీద ఈ నిర్ణయం పాలసీదారులకు ప్రయోజనకరమేనని స్పష్టమవుతోంది. వినియోగదారులపై భారం తగ్గడం వల్ల బీమా కొనుగోళ్లు పెరిగి, దీర్ఘకాలంలో కంపెనీలకు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలు, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రతను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అయితే, కంపెనీలు తమ పాలసీల ధరలను ఎలా సవరిస్తాయనే దానిపైనే వినియోగదారుడికి అందే తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, కొన్ని బీమా కంపెనీలు సెప్టెంబర్ 22వ తేదీలోపే తమ ప్రీమియంలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
స్టార్ హెల్త్ అందిస్తున్న సువర్ణావకాశం
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారులకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత ప్రీమియంలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 22లోపు స్టార్ హెల్త్ పాలసీ తీసుకునేవారికి 18% జీఎస్టీని పూర్తిగా మినహాయించడంతో పాటు, పాత (ప్రస్తుత) బేస్ ప్రీమియం ధరలకే పాలసీని అందివ్వనుంది. దీనివల్ల వినియోగదారులు భవిష్యత్తులో పెరగబోయే ప్రీమియంల భారం నుంచి తప్పించుకోవడమే కాకుండా, జీఎస్టీ మినహాయింపు పూర్తి ప్రయోజనాన్ని తక్షణమే పొందవచ్చు.
“ప్రభుత్వ నిర్ణయం వల్ల ఐటీసీ భారం కంపెనీలపై పడుతున్నందున భవిష్యత్తులో ప్రీమియంల పెంపు తప్పనిసరి. అందుకే ఈ లోపు పాలసీ తీసుకునే వారికి స్టార్ హెల్త్ అందిస్తున్న అవకాశాన్ని వినియోగించుకుంటే, వినియోగదారులు 18% జీఎస్టీ భారం లేకుండా పూర్తి ప్రయోజనం పొందినవారవుతారు” అని స్టార్ హెల్త్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9491679493 నంబరులో తనను సంప్రదించాలని ఆయన సూచించారు.