సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్
మట్టి మనుషులను బందూకులు పట్టించిన విరనారి ఐలమ్మ నేటి తరానికి ఆదర్శం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతి సందర్భంగా స్థానిక వినాయక నగర్ లోని ఆమె విగ్రహానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరివిముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యెాధురాలు చాకలి ఐలమ్మ, తన పంట పొలాలను కాపాడుకోవటంకోసం విస్నూర్ దొర గూండాలకు ఎదురొడ్డి కొంగునడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగిలా తిరగబడిందన్నారు.
వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగల్చిన అగ్నికణం ఐలమ్మ అని అన్నారు. మట్టి మనుషులను ఒక్కటి చేసి మహయెాధులుగా తీర్చిదిద్ది, బాంచన్ దొరా అన్న, బక్క జిక్కిన పేదలతో బందుకూలు పట్టించి విప్లవ భావాలు మండించిన నిప్పులకొలిమి ఐలమ్మ అని తెలిపారు. తన ఇంటిని కమ్యూనిస్టు పార్టి కార్యాలయంగా మార్చి, వీరాధివీరులకు అండగా నిలబడ్డదని తెలిపారు. పోరాటాన్ని పదునెక్కించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం, మనువాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, అనిత, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ నేటి తరానికి ఆదర్శం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES