Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ విద్య అధికారి ఆకస్మిక తనిఖీ..

ఇంటర్ విద్య అధికారి ఆకస్మిక తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్ లోనే హాజరు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను ఆయన బుధవారం ఉదయం 9.45 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బుద్దిరాజ్ అధ్యక్షతన అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కాని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, వారిని కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధ్యాపకులు ప్రతి నెల పరీక్షలతో పాటు ప్రతిరోజూ స్లిప్ టెస్ట్ లు నిర్వహించి మార్కులను రిజిస్టర్లలో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమన్వయంతో అన్ని సబ్జెక్ట్ లలో సన్నద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని బోధనేతర సిబ్బందినీ ఆదేశించారు ప్రతి విద్యార్థి అపార్, పెన్ నెంబర్ గుర్తింపుతో పాటు యుడైస్ పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ కోరిన మేరకు అదనపు అధ్యాపకుల కొరత తీర్చేందుకు ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad