పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలి…
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ,రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ…
నవతెలంగాణ – మునుగోడు
కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం సిఐటియు కార్యాలయంలో నిర్వహించగా .. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్ లు గా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు.
1996 కేంద్ర నిర్మాణరంగ సంక్షేమ చట్టం ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని దాని ద్వారా 9 రకాల సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు.అడ్డా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడ్డా మీదికి పనికొచ్చిన వారికి పేరు నమోదు చేసుకొని పనిలేని రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సగం కూలి చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్మాణ కార్మికులకు బైకులు ఇవ్వాలని ఇండ్లు లేని కార్మికులకు ఇంటి నిర్మాణానికి 10 లక్షలు సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడేది ఒక సిఐటియు మాత్రమేనని అన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకంతో పాటు ఇంటి యజమానుల ద్వారా కూడా లక్షలాది రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. నిర్మాణరంగ కార్మికులు తమ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాటమే తప్ప మరో మార్గం లేదని అన్నారు.నల్గొండ పట్టణంలో సెప్టెంబర్ 20న జరిగే 10వ జిల్లా మహాసభ, సెప్టెంబర్ 24,25 భద్రాచలంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.అనంతరం మండల నూతన కమిటీని 23 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు , జీడిమడ్ల సైదులు , పగడాల సైదులు, కాసర్ల రవీందర్ , కిట్టయ్య , జీడిమడ్ల లింగస్వామి , చంద్ర స్వామి , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES