నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పలు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బడుకల గంగాధర్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన ఏనుగు మోహన్ కిడ్నీ సంబంధ వ్యాధితో ఆరోగ్యం బాగా లేక ఇంటి వద్దనే మంచానికే పరిమితమయ్యాడు. ఆయన్ని పరమర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామానికి చెందిన జుంబరాత్ గంగ సాయమ్మ ఇటీవల గుండె పోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బద్దం రవి, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డి శ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, పడాల మల్లేష్, మేకల క్రాంతి, సృజన్, శంకర్, మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES