Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఒపీనియన్ బ్యాలెట్ లో పాల్గొని విజయవంతం చేయండి.. 

ఒపీనియన్ బ్యాలెట్ లో పాల్గొని విజయవంతం చేయండి.. 

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
సొంత ఇంటి పథకం కొరకు నిర్వహించే ఒపీనియన్ బ్యాలెట్ లో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ వల్లూరు వెంకటరత్నం కోరారు. బుధవారం మాచారపు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ  .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వివిధ పథకాల ద్వారా సొంత ఇంటిని ఇప్పిస్తుంటే, సంపద సృష్టికర్తలైన సింగరేణి కార్మికులకు ప్రభుత్వం సొంత ఇల్లు ఎందుకు ఎందుకు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. 

ప్రతి ఒక్క సింగరేణి కార్మికునికి  దిగిపోయే లోపు తప్పకుండా సొంత ఇల్లు ఉండాలని, దాని కొరకు యాజమాన్యం ఒక కమిటీ వేసి దాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక కార్మికుడు గురువారం 11వ తేదీ  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూనవరం రైల్వే గేటు దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో జరగనున్న  సొంత ఇంటి పథకం ఒపీనియన్ పోలింగ్ లో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని  కోరారు. ఈ కార్యక్రమాన్ని అన్ని  గనులపై నిర్వహించాలని అనుకున్నాం, కానీ యాజమాన్యం సింగరేణి గని ప్రాంతాలలో ఓటింగ్ జరుపుటకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. యాజమాన్య నిర్ణయాన్ని గౌరవిస్తూ, వారిపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకొని కూనవరం రైల్వే గేట్ దగ్గర ఓటింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నాం. కావున యావత్ కార్మిక వర్గం ఈ ఓటింగ్ లో పాల్గొని కార్మిక వర్గం అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము.ఈ సమావేశంలో విల్సన్ రాజు, ప్రభాకర్ రావు, సుమన్, సాయి కృష్ణ, బిక్షపతి, బుచ్చిరెడ్డి, శ్రీకాంత్, విజయకుమార్, ముజఫర్, భద్రయ్య, ఎల్లయ్య, సాంబ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad