Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఫెడరల్‌ రిజర్వ్‌ గవర్నర్‌ను తొలగించొద్దు

ఫెడరల్‌ రిజర్వ్‌ గవర్నర్‌ను తొలగించొద్దు

- Advertisement -

ట్రంప్‌ను నిలువరించిన ఫెడరల్‌ జడ్జి

వాషింగ్టన్‌ : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గవర్నర్‌ లిసా కుక్‌ను తొలగించకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తాత్కాలికంగా నిలువరిస్తూ ఫెడరల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర బ్యాంక్‌కు దీర్ఘకాలంగా వున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సవరించడానికి గతంలో ఎన్నడూ లేని రీతిలో వైట్‌హౌస్‌ చేపట్టిన న్యాయ పోరాటంలో ఇది ముందస్తు ఎదురు దెబ్బ. కాగా దీనిపై వైట్‌హౌస్‌ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. గవర్నర్‌ పదవిని చేపట్టడానికి ముందుగానే లిసా తాకట్టు కుంభకోణానికి పాల్పడ్డారని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న వాదనలు ఆమెను తొలగించడానికి సరైన కారణమేనా అనే కీలక అంశాన్ని అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి జియా కాబ్‌ ఇచ్చిన రూలింగ్‌ పరిష్కరించలేదు. కాగా తానెలాంటి తప్పు చేయలేదని లిసా కుక్‌ చెబుతున్నారు. ఆగస్టు చివరిలో కుక్‌ను తొలగించడానికి ట్రంప్‌ చర్యలు మొదలుపెట్టారు. కానీ ఆమె తన పదవిలో వుంటారని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad