Friday, September 12, 2025
E-PAPER
Homeమానవిమర్చిపోతున్నారా?

మర్చిపోతున్నారా?

- Advertisement -

వయసు పెరిగే కొద్దీ శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం సర్వసాధారణం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారం వల్ల చిన్న వయసులోనే రకరకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా, ఒత్తిడితో కూడిన జీవితం, ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఒక సమస్య మతిమరుపు. గతంలో జరిగిన వాటిని మర్చిపోవడం సర్వసాధారణం. అయితే ముందు రోజు ఏం జరిగిందో గుర్తుకు రాకపోయినా, మరిచిపోయినట్టు అనిపించినా.. జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
అధిక ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర వైద్య సమస్యలకు ఉపయోగించే మందులతో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు, ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి చురుకుగా ఉండేలా చూసుకోవాలి. దీనికి కొంత మెదడుకు పని అవసరం. చిన్న లెక్కల కోసం కూడా కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం మానుకోండి. చెస్‌, పజిల్స్‌ వంటి కార్యకలాపాలలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడు కణాలను చురుకుగా ఉంచుతుంది. ఏ వయసు వారైనా వ్యాయామం, నడకను నిత్యకృత్యంగా చేసుకోవాలి.
నీరు ఎక్కువ తాగడానికి ప్రాధాన్యతనివ్వాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకూడదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం ప్రారంభిస్తే, అది మెదడుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -