Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక అణచివేతను అరికట్టాలి

సామాజిక అణచివేతను అరికట్టాలి

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ

నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
సమాజంలో పని ప్రదేశాల్లో పురుషులతో పాటుగా మహిళలకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక అణిచివేతను అరికకడుతూ పని భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ కోరారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్మిక కర్షక భవనం శ్రామిక మహిళా సదస్సులో ఆమె మాట్లాడారు. 1979 నుండి కార్మిక వర్గంలో ఉన్న శ్రామిక మహిళలు పని ప్రదేశాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారినా మహిళలకు భద్రత కరువైందని పని ప్రదేశాల్లో వేధింపులు ఆర్థిక అసమానతలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రయివేటు హాస్పిటల్లో, ప్రయివేటు పాఠశాలలో తదితర సంస్థల్లో పని చేస్తున్న మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ ఎం పద్మ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్‌, శ్రామిక మహిళలు రేణుక, భాగ్యలక్ష్మి, లత దేవమ్మ రేణుక సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -