Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటాహసంగా ప్రారంభమైన గణిత, సాంస్కృతి విజ్ఞానమేల 

అటాహసంగా ప్రారంభమైన గణిత, సాంస్కృతి విజ్ఞానమేల 

- Advertisement -

నవతెలంగాణ -రామారెడ్డి
జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్లో మూడు రోజులు గణిత, సాంస్కృతి విజ్ఞానమేలను అటాహసంగా ప్రారంభించారు. రాష్ట్రం స్థాయి శ్రీ సరస్వతి శిశు మందిర్ సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పాల్గొని, మాట్లాడుతూ… సైన్స్ అంటే అనంతం గా ఉంటుందని తెలిపారు. నేను కూడా అందరిలాగే చదివేవారినని, సైన్స్ పై అభిమానం పెరిగి రీసెర్చ్ చేసి శాస్త్రవేత్తగా ఎదిగానని అన్నారు.

ఈ సృష్టిలో అతి ముఖ్యమైనది జీవమని, ఈ జీవం అనేది ఒకే కణంతో ఏర్పడుతుందని, మానవ శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయని తెలిపారు. సైన్స్ అంటేనే కొత్త కొత్త విషయాలు కనుగొనడం అని అన్నారు. జాయింట్ సెక్రెటరీ ఎస్ఎస్వి పి తెలంగాణ ఎన్ వి కే విశ్వేశ్వరరావు మాట్లాడుతూ… సైన్స్ అంటే సృజనాత్మకత అని, చదువుల్లో వెనుకబడిన థామస్ హల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నారని అన్నారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రదర్శనలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 303 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్యాంసుందర్, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, నలాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, కొండ సుజాత, అరసుమారెడ్డి,, శంకర్, గిరెడ్డి రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -