Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షులుగా పుల్గం దామోదర్‌రెడ్డి

పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షులుగా పుల్గం దామోదర్‌రెడ్డి

- Advertisement -

ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూటీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులుగా పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి బిక్షంగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నారాయణగూడలో పీఆర్టీయూటీఎస్‌ 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులుగా పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి బిక్షంగౌడ్‌ను వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా మాజీ అధ్యక్షులు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్‌ వ్యవహరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ సంఘ నిర్మాణం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇచ్చే ప్రాతినిధ్యంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. పీఆర్టీయూటీఎస్‌ ఆడిట్‌ కమిటీ చైర్మెన్‌గా సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిను నియమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డి, కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు జగన్‌మోహన్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -