Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పటేల్ గూడెం మార్గంలో వంతెన నిర్మించాలి..

పటేల్ గూడెం మార్గంలో వంతెన నిర్మించాలి..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నుండి నుండి పటేల్ గూడెం పోయే మార్గంలో వంతెన నిర్మించాలని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వివిధ అవసరాల కోసం వందలాది మంది ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు పారడంతో రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే సమస్య మొదలవుతుందని అన్నారు. ఈ సందర్భంగా పాపకారి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే మా సొంత డబ్బులుతో నాలుగు సార్లు కాజువే ఏర్పాటు చేసుకున్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా ఆలేరు ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయనే కోరారు. ఈ కార్యక్రమంలో బొంకూరి సంతోష్,నలవాల సోమలింగం,రఘుపతి రెడ్డి,మోత్కూరి ఐలయ్య,గాదె రాజిరెడ్డి,గాదె సోమిరెడ్డి, బొంకూరి రాములు,చల్లా మోహన్ రెడ్డి, అనంతుల రఘుపతి రెడ్డి, చుక్కల బాలయ్య,గాండ్ల రాజయ్య,డాక్టర్ నాగేందర్,గంధమల్ల ఐలయ్య,ఆ ప్రాంత రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -