ఓ మంచి ప్రేమ కథ, కుటుంబ విలువలు, తండ్రీ కూతుళ్ళ అనుబంధం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్.. ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఈనెల 19న మూవీని విడుదల చేస్తున్న క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసి మేకర్స్ అంచనాలు పెంచేశారు. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీని విజరు పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి.సుబ్రహ్మణ్యం అందించారు. హీరో నాగ చైతన్య తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. వాస్తవ ఘటనలతో ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్, హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్, డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు.. ఇలా అన్నీ కూడా ఆకట్టు కున్నాయి. మ్యూజిక్, ఆర్‌ఆర్, విజువల్స్ అద్భుతంగా ఉంటూ అలరిస్తున్నాయి అని చిత్ర బృందం తెలిపింది. నరేష్, వాసుకి, నంద గోపాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్.రావు, డీఓపీ :శ్రీ సాయి కుమార్ దారా, సంగీతం: విజరు బుల్గానిన్, ఎడిటర్: ఉద్ధవ్, ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని.