Sunday, September 14, 2025
E-PAPER
Homeజిల్లాలుసాటాపూర్-కందకుర్తి రోడ్డు గుంతలమయం..

సాటాపూర్-కందకుర్తి రోడ్డు గుంతలమయం..

- Advertisement -

అదమరిస్తే అంతే.. తరచూ ప్రమాదాలు
నవతెలంగాణ – రెంజల్ 

మండలంలో ని సాటాపూర్ చౌరస్తా నుంచి కందకుర్తి వరకు గల ప్రధాన రోడ్డు గుంతల మయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. సాటాపూర్ నుంచి కందకుర్తి వరకు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారినప్పటికీ రోడ్డు భవనాల శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు 56 గుంతలు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు సైతం ఈ రోడ్డుపై వెళ్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అదమరిచి నడిపిస్తే ప్రమాదాలు తప్పడం లేదు. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి ఈ గుంతలను పూడ్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మధ్య భాగంలో ఉన్న వీటిని ప్యాచ్ వర్క్ ద్వారా మరమ్మత్తులు చేపట్టినట్లయితే ప్రమాదాలు నివారించే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -