జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య
నవతెలంగాణ – వనపర్తి
జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ లైబ్రరీ సెస్‌ను వెంటనే చెల్లించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో పెండింగ్ లైబ్రరీ సెస్ చెల్లింపు అంశంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు సామాజిక ఆస్తులని, కాబట్టి వాటిని సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ లైబ్రరీ సెస్‌ను వెంటనే చెల్లించాలని అన్నారు.
ప్రాపర్టీదారులు కట్టే టాక్స్ లో 8 శాతం గ్రంథాలయాలకు వెళ్తుందని, అది సకాలంలో గ్రంథాలయాలకు చేరితేనే సరైన నిర్వహణ ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన పెండింగ్ సెస్ బకాయిలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై నెలాఖరులో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అప్పటిలోపు సంబంధిత అధికారులు తమ పరిధిలోని గ్రంథాలయాల సెస్ పెండింగ్ బకాయిలపై పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ లైబ్రరీ సెస్‌ను వెంటనే చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES