కేసులు కొట్టివేస్తూ తీర్పు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
సైబరాబాద్, సంగారెడ్డి పోలీస్‌స్టేషన్లలో ఆయుష్ వైద్యులపై నమోదైన కేసుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) చర్యలు తీసుకునేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యం చేశారంటూ నేరుగా టీఎంసీ చర్య తీసుకోకూడదని పేర్కొంది. ఈఏడాది మే మాసంలో ఆయా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. తద్వారా పిటిషనర్లపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. రూల్స్‌కు వ్యతిరేకంగా అల్లోపతి వైద్యం చేస్తున్నారన్న ఆరోపణలమేరకు దాడులు నిర్వహించిన టీఎంసీ కొందరు ఆయుర్వేద వైద్యులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. లోకేష్ మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారించి తుది ఉత్తర్వులను వెలువరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అధికారం లేదని పేర్కొంది. చర్యలు తీసుకునే నిబంధన ఆయుష్ కమిషనర్‌కు మాత్రమే ఉందని పిటిషనర్ల వాదన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) సెక్షన్ 318, 319 కింద నేరాలుగా పరిగణించే వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్లు ఆయుర్వేదంలో అర్హత సాధించిన వైద్యులని, అల్లోపతి వైద్యం చేసేందుకు వీల్లేదని పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి, టీఎంసీకి అధికారం లేదని, పిటిషనర్లపై చర్యల అధికారం ఆయుష్ కమిషనర్‌కే ఉందని అభిప్రాయపడింది. లేని అధికారంతో టీఎంసీ చర్యలు తీసుకోవడం చెల్లదని వివరించింది. ఆ రెండు పోలీస్‌స్టేషన్లలో కేసులు చెల్లవని స్పష్టం చేసింది. చట్ట నిబంధనల ప్రకారం కమిషనర్ తదుపరి చర్యలు తీసుకునే అధికారం ఉందని తెలిపింది.
ఆయుష్ డాక్టర్లకు హైకోర్టులో ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES