Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన మంతెన గంగమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు బొలు దేవేందర్ సూచనల ప్రకారం బీరెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి ఇర్సవడ్ల భవాని నారాయణ, పిఎసిఎస్ డైరెక్టర్ కాయితి లింగా చారి, వంగరి సదానందం, దాయ వెంకటేశ్వర్లు(కోడి) కెక్కెర్ల వెంకటేశ్వర్లు, దళిత నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -