- Advertisement -
పీడనపై
ఎత్తిన ఏ పిడికిలికి
మతం రంగు అంటదు!
మొలకెత్తడమే
యుద్ధమైన చోట
తిరుగుబాటు దేశభక్తే!
అవును
యుద్ధమే జరిగింది
పీడకుల పీడితుల మధ్య!
చరిత్రలో
చొచ్చుకొచ్చిన ఉన్మాదాలకు
ఆధారాలు తావు ఉండవు!
కడుపు కాలినచోట
అసత్యాలు ఎల్లకాలం
ప్రచారాలతో నిలబడలేవు!
వీరులకెన్నడూ
అంతర్గత మేనిఫెస్టోలుండవు
విజయమో వీర స్వర్గమో!
తెలంగాణ విముక్తి పోరులో
ఎవరు రక్తం ప్రాణం ధారబోసిరో
వారి పాదాలకు
ప్రణమిల్లుటే సంస్మరణ!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261.
- Advertisement -