నవతెలంగాణ-సదాశివ నగర్
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని రైతు వేదికలో మూడు రోజులు అంగన్వాడీ టీచర్లలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను ఐసిడిఎస్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో తరగతులను నిర్వహించినట్లు తెలిపారు మొదటి రోజు పోషణ్ బి పడాయి బి వై శిక్షణ ఆధార్ శిలా, నవ చేతన అంశాల విద్యపై అవగాహన కల్పించారు. రెండవ రోజు అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్య పిల్లల నిర్వహణ పిల్లల పెరుగుదలపై అవగాహన కల్పించారు, మూడవరోజు దివ్యాంగుల పిల్లలలో దివ్యాంగుల ప్రోటోకాల్ వైకల్యాలను ముందుగానే గుర్తించడం దివ్యాంగులకు ఇవ్వవలసిన సలహాలు సూచనల గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడి టీచర్లకు ఆన్లైన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు పద్మ వనజ ,పద్మావతి ,జ్యోతి అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు
ముగిసిన అంగన్వాడి టీచర్ల శిక్షణా తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES