Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా లింగాల గంగాధర్ నియామకం..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా లింగాల గంగాధర్ నియామకం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన లింగాల గంగాధర్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  కొత్తగా పార్టీ పెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో కీలక పదవి పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా లింగాల గంగాధర్ మాట్లాడుతూ.. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్సీ పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీసీలు తమ హక్కులను కాపాడుకోవాలని అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుందని లింగాల గంగాధర్ తెలిపారు. బీసీల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. మేధావులు, యువకులు, మహిళలు ,అందరూ ఈ పార్టీలో చేరి పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గంగాధర్ వివరించారు. నియమకం పట్ల గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -