Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా జడ్జి నాగరాణి 

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా జడ్జి నాగరాణి 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మహిళా సాధికారితపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా జడ్జి నాగరాణి పాల్గొని మహిళలకు భారత రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై, చట్టాలపై మాట్లాడుతూ.. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, గృహహింస చట్టం, బాల్య వివాహాల నివారణ, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై విపులంగా వివరించారు. మహిళలు చట్టపరమైన అవగాహనతో ముందుకు సాగితే సమాజంలో సమానత్వం సాధ్యమని జడ్జి నాగరాణి  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు తులసి, శారదా, తహసిల్దార్ రేణుక చహన్, ఎంపీడీఓ రాజేశ్వర్,  ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -