- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని కూల్ తాండాకు చెందిన గంగావత్ లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి స్పందించి, గురువారం రూ.2000 ఆర్థిక సహాయాన్ని మాజీ ఎంపిటిసి చందర్ నాయక్, కాంగ్రెస్ నాయకుల చేతుల మీదగా బాధ్యత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ… మండలంలో పేద ప్రజలు ఆపదలో ఉన్నారని సమాచారం ఇవ్వడంతో, నేనున్నానని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -