Thursday, September 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్లంబాడీలను ఎస్టీ జాబితా నుండి వెంటనే  తొలగించాలి

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి వెంటనే  తొలగించాలి

- Advertisement -

తహశీల్దార్ కి ఆదివాసీలు మెమోరాండం అందజేత
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
లంబాడాలను ఎస్టి జాబితా నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో గురువారం తహశీల్దార్ శ్యాంసుందర్ కు ఆదివాసీ ప్రజలు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు లంబాడాలకు ధృవీకరణ పత్రాలు, ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు అందించవద్దన్నారు. లంబాడాలకు ఎస్టీ హోదా కల్పించడం ద్వారా ఎస్టీల కోసం ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ ఉపాధ్యాయ ఉపాధి అవకాశాలలో లంబాడాలు అధిక వాటాను పొందుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాయ్ సెంటర్ ల పటేళ్లు, సర్మేడి లు మహాజన్లు దేవరీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -