Friday, September 19, 2025
E-PAPER
Homeసినిమాకలి పురుషుడిపై యుద్ధం..

కలి పురుషుడిపై యుద్ధం..

- Advertisement -

సంధ్య ఫిలిం బ్యానర్‌ పై టి. రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘గాలి’. రామ్‌ ప్రసాద్‌ గురజాడ, అంజలి, శ్రీకాంత్‌ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బి వి సుబ్బా రెడ్డి నటించిన ఈ చిత్ర టీజర్‌, సాంగ్‌ లాంచ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత సాయి వెంకట్‌, బల్లెం వేణు మాధవ్‌, రచయిత తిరునగిరి శ్రీనివాస్‌, విద్యావేత్త దరిపల్లి నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొని, మోడి జన్మదిన సందర్భంగా చిత్ర ఆడియో, టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ,’రాము రాసుకున్న సోషియో ఫాంటసీ కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అని తెలిపారు. ‘కలి పురుషుడుకి, అమ్మ వారికి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ చిత్రం. సస్పెన్స్‌తో సాగే ఈ చిత్రం మన ప్రధాని నరేంద్ర మోడి పుట్టినరోజున టీజర్‌, సాంగ్‌ లాంచ్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అని దర్శకుడు రాము చెప్పారు. సాయి వెంకట్‌ మాట్లాడుతూ, ‘దేవతా మూర్తి పాత్రలో నటించిన రోజా రాణి కలను నెరవేర్చడానికి వారి భర్త లక్ష్మి నారాయణ నిర్మాతగా మారి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -