Friday, September 19, 2025
E-PAPER
Homeఆటలుఆరు జట్లతో ప్రీమియర్‌ లీగ్‌

ఆరు జట్లతో ప్రీమియర్‌ లీగ్‌

- Advertisement -

న్యూఢిల్లీ : భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)ను ఆవిష్కరించింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరు ప్రాంఛైజీలు ఆటగాళ్ల ముసాయిదా నుంచి ఆర్చర్లను ఎంపిక చేసుకున్నాయి. 36 మంది భారత, 12 మంది విదేశీ ఆర్చర్లను ఆరు ప్రాంఛైజీలు జట్టులోకి తీసుకున్నాయి. తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ, తానిపర్తి చికితలు ఏపీఎల్‌లో బాణం వదలనున్నారు. కాకతీయ నైట్స్‌, పృథ్వీరాజ్‌ యోధాస్‌, మైటీ మరాఠాస్‌, రాజ్‌పుతాన రాయల్స్‌, చెరో ఆర్చర్స్‌, చోలా చీఫ్స్‌లు తొలి సీజన్‌లో ఏపీఎల్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఏపీఎల్‌కు సినీ హీరో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -