నవతెలంగాణ – తుంగతుర్తి
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రం బాగుంటుందని రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. శుక్రవారం”స్వస్త్ నారి… సశక్త్ పరివార్ అభియాన్”కార్యక్రమంలో భాగంగా రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాల నందు ప్రత్యేక మహిళా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు.
వైద్యశిబిరాల్లో నేత్ర, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, డెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్య నిపుణులు పాల్గొని సేవలందిస్తారన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. అవసరమైన మందులను అందజేస్తారని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని అన్నారు. అలాగే మహిళలు రక్త హీనతకు గురి కాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రక్తహీనతతో బాధపడుతున్న కిశోర బాలికలకు 98 మందికి హెచ్ బి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.ఆర్.వైష్ణవి( ఎం.డి జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్), డా.టీ.అర్చన (ఆర్ బి ఎస్ కే మెడికల్ ఆఫీసర్), డా.సరళ,డా.కిరీటి,డా.మౌనిక రాథోడ్, డాక్టర్ మధుప్రియ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాలను మహిళలు ఉపయోగించుకోవాలి: డా.లింగమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES