నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శుక్రవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 16 తేదీ ఉదయం సమయం 09 గంటలకు గంజు మార్కెట్ లో కూరగాయల షాపు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్ కు చికిత్స గురించి తరలించారన్నారు.
వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి చూడగ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అతని వయసు సుమారు 55 నుండి 60 ఉంటుంది. అతని పైన బట్టలు బూడిద రంగు బనియను క్రీమ్ కలర్ ప్యాంటు ధరించినాడు. వ్యక్తి వాలకం బట్టి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది,. ఇతని యొక్క జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలన్నారు.
గుర్తుతెలియని వృద్దుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES