నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
స్థానిక వినాయక నగర్ లోని అభ్యస ద స్కూల్ నందు బాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులే లఘునాటికలు, యాంకరింగ్, స్క్రిప్ట్ యాంకరింగ్, పిల్లలే రచించి నిర్వహించడం ప్రత్యేకం. ఈ కార్యక్రమంలో పర్యావరణ సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సమయపాలన ,రామాయణ, భారత ఇతిహాసాలో నుంచి లగునాటికలు ఇంకా తెలంగాణ జానపద పాటలకు నృత్యాలు చేసి తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకర్షింప చేశారు.
ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ చెన్న అన్నపూర్ణ మాట్లాడుతూ… విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు, నిర్వహణ నైపుణ్యాలు , సృజనాత్మకత పెంచే విధంగా విద్యతోపాటు జీవన నైపుణ్యాలు సాధించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బాల మహోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి శ్రీనివాస్,శ్రీకాంత్ ప్రధానోపాధ్యాయులు మాధవి, చైతన్య ఇంకా ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.