Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయండి: సీఐటీయూ

జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయండి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బందిని పస్తులంచకుండా గత మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దమందడి మండల పరిధిలోని దొడగుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు 20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలన్న జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు చెల్లించాలన్నారు. ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్,  వెంకటేష్, కృష్ణయ్య, లలితమ్మ, కురుమమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -