Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన సంక్షేమ హాస్టల్ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి

గిరిజన సంక్షేమ హాస్టల్ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

కార్మికుల సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆది  
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట నిరసన
నవతెలంగాణ – వనపర్తి 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహం విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని దేశించి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ గత ఎనిమిది రోజుల నుంచి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులే వంటలు చేస్తున్నారన్నారు. దీనివల్ల విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. విద్యార్థులను సమీకరించి వారికి మద్దతుగా ఆందోళన పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్, ఈశ్వర్, మనోజ్, మహేష్, శివ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -