అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ముఫ్టీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి.అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. సోషల్ మీడియా అంతటా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉం టుంది. ఇంకొన్ని సార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’ అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టొరీ సెంట్రల్ ఐడియాని ప్రజెంట్ చేస్తోంది. అర్జున్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. స్టైలిష్ మేకింగ్‌తో టీజర్ ఆకట్టు కుంది. ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, మేకర్స్ ఇప్పుడు సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మల యాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్ కుమార్, జి.కె.రెడ్డి, పి.ఎల్.తేనప్పన్, లోగు, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు.