కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్
నవతెలంగాణ- హైదరాబాద్
అంబర్‌పేట నియోజకవర్గం బతుకమ్మకుంట పునర్నిర్మాణానికి నిరంతరం కషిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేరు పెట్టాలని ఖైరతాబాద్ జిల్లా మహిళాధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కోరారు. ఈ నెల 26న బాగ్ అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు హనుమంతరావు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ 35 ఏండ్లుగా బీఆర్‌ఎస్ నాయకుల కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహకారంతో తిరిగి దక్కించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మకుంట ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే రోజు నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగం ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ హనుమంతరావు పోరాట ఫలితంగా బతుకమ్మకుంటను దక్కించుకోగలిగామన్నారు.
పార్టీలకతీతంగా మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా సీఎంకు, హైడ్రా కమిషనర్‌కు, వీహెచ్‌కి ఖైరతాబాద్ డీసీసీ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ రోహిన్ రెడ్డికి, మాజీ ఫ్లోర్ లీడర్ పుల్లా నారాయణ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్, పులి జగన్, పుల్లా నారాయణ స్వామి, గడ్డం లక్ష్మణగౌడ్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్ రావు, పంజాల వెంకటేష్ గౌడ్, బ్లాక్ అధ్యక్షులు కుంకుమ రాజేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీధర్‌గౌడ్, కోటం అనిల్, రావుల సుధాకర్, ఇ. ప్రభాకర్, సి సుధాకర్, మహేష్ కుమార్ గౌడ్, కష్ణ గౌడ్, సందప్ గౌడ్, ప్రకాష్, కొట్ల కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, బాను యాదవ్, మహిళా సీనియర్ నాయకులు సునీత రెడ్డి, లావణ్య, పద్మ, శాంతమ్మ, ఫాతిమా, కవిత తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మకుంటకు హనుమంతరావు పేరు పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES