Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంచీరల కూలి పెంచండి..

చీరల కూలి పెంచండి..

- Advertisement -

– సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట వార్పిన్‌ కార్మికుల ధర్నా
– సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌

ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్న మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వార్పిన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గురువారం కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సిరిమల్ల సత్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం చీరల ధర పెంచినా యజమానులు కూలి పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంటనే యజమానులతో చర్చలు జరిపి కార్మికుల కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశ్వర్లు, ఐరేని ప్రవీణ్‌, అవధూత హరిదాసు, ఆడిచర్ల రాజు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -