నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఈనెల 27న జరిగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. శనివారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి దడువాయి గుమస్తా చాట స్వీపర్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 27 న వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర రెండవ మహాసభను నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నిజాంబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి , మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పగంగా రెడ్డి , ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు , రాష్ట్ర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీ తడువాయి చాట స్వీపర్ కార్మికులు హాజరవుతున్నారని అన్నారు.
ఈ మహాసభల్లో మార్కెట్ యార్డుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రాబోయే కాలంలో మార్కెట్ యార్డుల అభివృద్ధికి తీసుకునేటటువంటి కార్యక్రమాలు నిర్ణయాల పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు ఉపాధ్యక్షులు చక్రపాణి, భాగ్యలక్ష్మి, సాయిలు కార్యదర్శులు హనుమాన్లు, అనిల్, కవిత, సంపత్ తదితరులు పాల్గొన్నారు.