Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీడిసి పేరుతో పెత్తందారుల ఆగడాలను అరికట్టాలి

వీడిసి పేరుతో పెత్తందారుల ఆగడాలను అరికట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ని ద్వేషించి సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ లు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో భూస్వామ్య విధానం నుండి పెత్తందారి వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో విడిసిల పేరుతో దళిత, బహుజనులను, మైనార్టీలను గత పది సంవత్సరాల నుండి హింసిస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిఆర్ఎస్ నాయకుడు రామన్నపేటలో ఒక వ్యక్తి ఇల్లును జెసిబితో కూలగొట్టిన పరిస్థితి ఉందన్నారు. అట్లాగే ప్రతి రోజు ఈ ప్రాంతంలోని గ్రామాలలో బడుగు, బలహీన వర్గాలపైన కట్టుబాట్లతో సాంఘిక బహిష్కరణ , గ్రామ బహిష్కరణలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు.

చట్టాన్ని న్యాయాన్ని తమ చేతిలోకి తీసుకొని పోలీస్ వ్యవస్థను న్యాయస్థానాలను కూడా ధిక్కరించి దాడులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కనుక గత 5,6 మాసాలుగా తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై కొద్ది మంది పెత్తందారులు, వీడీసీ పేరుతో వాళ్లు కొనుగోలు చేసిన భూములను లాక్కోవాలని ఆలోచనతోనే కుట్రలు కుతంత్రాలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను బయన్దోలను గురిచేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోకపోగా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. అట్లాగే ఈ చర్యలను సభ్య సమాజానికి తెలపడానికి వెళ్లిన జర్నలిస్టును కూడా దాడి చేసి కొట్టిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్లో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.ఓమయ్య, అడ్డికే రాజేశ్వర్ , జిల్లా నాయకులు సాయ గౌడ్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -