నవతెలంగాణ – హైదరాబాద్
పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్, మిస్సైల్స్‌తో దాడికి తెగబడిన వేళ ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ ధీటైన సమాధానం చెబుతూ.. బాంబుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 కి.మీ పరిధిలోనే ఊహించని ఘటన జరగడంతో వెంటనే షరీఫ్‌ను ఆయన పర్సనల్ స్టాఫ్ సురక్షిత బంకర్‌లోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కాసేపట్లో ధృవీకరించనున్నాయి. మరోవైపు తెల్లవారే లోపు పాక్‌స్థాన్‌ను కకావికలం చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం అవుతున్నట్లుగా భారత రక్ష శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా పఠాన్ కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం కూల్చింది. ఇందులో ఎఫ్ 16 యుద్ధ విమానం కూడా ఉంది. ఎఫ్ 16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుని..జలంధర్ లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంది.
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ బాంబు పేలుళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES