Sunday, September 21, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నటుడు మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం

నటుడు మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం

- Advertisement -

2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు
కేంద్ర సమాచార,ప్రసారశాఖ ఎక్స్‌లో పోస్టు

మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం లభించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని ప్రకటించింది.
2023 సంవత్సరానికిగానూ మోహన్‌లాల్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.
నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలన చిత్ర రంగానికి ఆదర్శ వంతమైన సేవలను మోహన్‌లాల్‌ అందించారని పేర్కొంది. ఆయన అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. సెప్టెంబర్‌ 23న జరిగే 71వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మోహన్‌లాల్‌ ఇప్పటికే ఆరు జాతీయ చలన చిత్ర అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే భారతప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించింది. దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన మోహన్‌లాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -