Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలు, ఆడపిల్లలకు రక్షణ కరువు

మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కరువు

- Advertisement -

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుధారాణి
ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ -నల్లగొండ టౌన్‌

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లెక్చరర్లు, విద్యార్థినులు ఆటపాటల తో సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుధారాణి, ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కరువైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మ అని చెప్పారు. అందరూ కలిసి స్నేహభావంతో పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతూ జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు.

సమాజంలో నేటికీ మహిళలను రెండో తరగతి పౌరురాలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బేటి బచావో బేటి పడావో అని చెబుతున్న దేశంలో స్త్రీ నిష్పత్తి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లిగల్‌ సెల్‌ కన్వీనర్‌ మేకల వరుణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్‌, ఖమ్మం పాటి శంకర్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు వరలక్ష్మీ, అనురాధ, తుమ్మల పద్మ, అరుణ, గోవర్థన, ఉమ నాగమణి, సుల్తాన్‌, జంజరాల ఉమ, మారుపాక కిరణ్‌, సైఫ్‌, నవదీప్‌, రియాజ్‌, సాయి, కళాశాల లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -